
అస్సలు ఫామ్ లో లేని యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు తన ఆశలన్నీ రానున్న చిత్రం సీటిమార్ పై పెట్టుకున్నాడు. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా సరైన సమయం కోసం చూసి విడుదల చేయాలని ఆగిపోయారు. ఇక ఇప్పుడు చిత్ర రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ వచ్చింది.
సీటిమార్ ను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది. గోపీచంద్ కబడ్డీ కోచ్ గా ఈ సినిమాలో కనిపిస్తాడు. హీరోయిన్ గా తమన్నా చేస్తోంది. ఆమె తెలంగాణ రాష్ట్ర కబడ్డీ కోచ్ గా కనిపిస్తుంది. ఇప్పటికే జ్వాలా రెడ్డి సాంగ్ విడుదలై సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన సీటిమార్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ విజయం అందుకుంటాడేమో చూడాలి.