Homeటాప్ స్టోరీస్అవిశ్రాంత అయోధ్య యోధుడు పరాశరన్

అవిశ్రాంత అయోధ్య యోధుడు పరాశరన్

Senior Advocate K.Parasaran
Senior Advocate K.Parasaran

అయోధ్య కేసులో హిందూ సంస్థల తరపున వాదించిన న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ K. పరాశరన్, ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 93 ఏళ్ళ వయసులో అవిశ్రాంతంగా ఆ శ్రీరాముడి కోసం అంటే రామ్ లల్ల విరాజ్ మాన్ తరఫున వాదించారు.

 అయోధ్య స్థలం పై సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పు చెబుతున్నప్పుడు పరాశరన్ గారు కోర్టు హాలులో మొదటి వరుసలో కూర్చుని, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చదువుతున్న తీర్పును ఏకాగ్రతతో విన్నారు.  తీర్పు అయిన తరువాత ఇతర న్యాయవాదులు అందరూ ఒక్కసారిగా పరాశరన్ గారి దగ్గరకు వచ్చి ఆయన అభినందనలతో ముంచెత్తారు. అందరూ ఆయనకు ఫోటో కోసం పర్మిషన్ అడగగా పరాశరన్ గారు వారికి అనుమతి ఇచ్చారు.

- Advertisement -

 రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం లో ఆయన 40 రోజుల పాటు అవిశ్రాంతంగా జరిగిన వాదోపవాదాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ 40 రోజులలో ఒక్కసారి కూడా ఆయన సహనం కోల్పోలేదు.  ముస్లిం సంస్థల తరపున వాదిస్తున్నన్యాయవాది రాజీవ్ ధావన్  గారు కొన్నిసార్లు అసహనంతో కొన్ని పత్రాలు చించివేసినా, పరశరన్ గారు శాంతం గానే ఉన్నారు.  గత నెల 16వ తేదీన రాజ్యాంగం ధర్మాసనం వాదనలు ముగిసిన తర్వాత, కోర్టు బయట రాజీవ్ ధావన్ ను కలిసి, ఒక న్యాయవాదిగా తాము కక్షిదారులు పక్షాన మాత్రమే పోరాడతామని, బయట తమ మధ్య ఎటువంటి ఘర్షణ లేదని ప్రపంచానికి తెలియచేసారు.

న్యాయవాది పరాశరన్ గారు తమిళనాడులోని శ్రీరంగంలో ఒక అయ్యగారు వేద బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. పరాశరన్ గారు 1958లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుండి 1989 వరకు దేశ అటార్నీ జనరల్ గా పనిచేసారు. ఆయన అందించిన అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చింది. ఆయన వాదించిన ప్రతిష్టాత్మక కేసులలో రామసేతు మరియు శబరిమల కేసులు కూడా ఉన్నాయి.

8 నెలలపాటు అవిశ్రాంతంగా ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు కేసు విచారణ నిమిత్తం న్యాయస్థానానికి హాజరయ్యే పరాశరన్ గారు సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు వాదనలు వినిపించే వారు. ఆయనకు సహకరించిన న్యాయవాదుల బృందంలో పీవీ యోగేశ్వరన్,  అనిరుద్ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి దాని, అశ్విన్ కుమార్ డి.ఎస్, భక్తి వర్ధన్ సింగ్ ఉన్నారు.  గత నెల 16 వ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పరాశరన్ గారిని మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డుతో సత్కరించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All