Homeటాప్ స్టోరీస్సీనియర్ నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య

సీనియర్ నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య

senior actress annapurna daughter keerti commits suicideవందలాది చిత్రాల్లో పలువురు అగ్ర హీరోలకు తల్లిగా నటించి టాలీవుడ్ అమ్మగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది . అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది . హైదరాబాద్ బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ నివాసంలో ఈ సంఘటన జరిగింది . అన్నపూర్ణ కూతురు కీర్తి గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది దాంతో ఇలా ఆత్మహత్య కు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు .

కీర్తి ఆత్మహత్య విషయం తెలియగానే రంగప్రవేశం చేసిన పోలీసులు డెడ్ బాడీ ని స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . దర్యాప్తు లో అనారోగ్య సమస్యలే ఆత్మహత్య కు కారణమని తెలిస్తే డెడ్ బాడీ ని వెంటనే అన్నపూర్ణ కు అప్పగించనున్నారు . తెలుగులో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు లతో పాటుగా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ ,మోహన్ బాబు , రాజశేఖర్ ల చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించింది అన్నపూర్ణ అయితే ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో కన్నీరు మున్నీరు అవుతోంది ఆ కుటుంబం .

- Advertisement -

English Title: senior actress annapurna daughter keerti commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All