Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్ట్రాన్స్ జెండ‌ర్స్ కోసం సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌!

ట్రాన్స్ జెండ‌ర్స్ కోసం సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌!

ట్రాన్స్ జెండ‌ర్స్ కోసం సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌!
ట్రాన్స్ జెండ‌ర్స్ కోసం సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంద‌లు ప‌డుతున్న వారికి అండ‌గా నిలుస్తున్నారు. జీహెచ్ ఎంసీ పారిశుధ్య కార్మికుల‌కు నెల రోజుల పాటు పాలు, బాదం మిల్క్. మ‌జ్జిగ‌ అందించిన ఆయ‌న ఇదే త‌ర‌హాలో క‌ర్నూలు పారిశుధ్య కార్మికుల‌కు అందించి అండ‌గా నిలిచారు. ఇటీవ‌ల ట్రాన్స్ జెండ‌ర్స్ (హిజ్రా)కు నిత్యావ‌స‌ర వ‌స్తువులు అందించి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు.

- Advertisement -

అంతే కాకుండా వీళ్ల‌కు సాయం చేయ‌డానికి మ‌రింత మంది ముందుకు రావాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో అత్యంత ఇబ్బంది ప‌డుతున్న వాళ్లు ట్రా‌న్స్ జెండ‌ర్స్‌.  వాళ్లు ప‌డుతున్న క‌ష్టాల‌ని ఊహించ‌లేం కూడా. అన్నం లేక‌, ఉండ‌టానికి ఇళ్లు దొర‌క్క‌, అద్దెలు క‌ట్టుకోలేక చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇవి కాక స‌మాజంలో వాళ్ల ప‌ట్ల ఉండే వివ‌క్ష‌, అపోహ‌లు వాళ్ల ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్ల‌కి అడ్ర‌స్ వుండ‌దు. ఓట‌ర్ కార్డ్ వుండ‌దు. రేష‌న్ కార్డు వుండ‌దు. హెల్త్ కేర్ ప‌థ‌కాలు లేవు. సెన్సిటివ్‌గా వుందాం. వాళ్ల‌నీ స‌పోర్ట్ చేద్దాం.

ఎవ‌ర‌న్నా కాంటాక్ట్ చేయాలి అంటే [email protected]’’ అంటూ శేఖ‌ర్ క‌మ్ముల షేర్ చేశారు. ఆయ‌న చేసిన సాయానికి కృత‌జ్ఞ‌త‌గా హిజ్రాలు `థ్యాంక్యూ శేఖ‌ర్ క‌మ్ముల‌` అంటూ ప్లా కార్డులు ప‌ట్టుకుని త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆయ‌న‌లా త‌మ‌ని ఆదుకోవ‌డానికి మ‌రింత మంది ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts