
యాక్షన్ హీరో గోపీచంద్ గత ఏడేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన లేటెస్ట్ చిత్రం సీటిమార్ వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 10న విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ రివ్యూలను తెచ్చుకుంది. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ కూడా ప్రామిసింగ్ గా ఉన్నాయి. తొలి వీకెండ్ లో బాగా పెర్ఫర్మ్ చేసిన సీటిమార్, సోమవారం కొంత నెమ్మదించింది. దీంతో చిత్ర విజయావకాశాలపై కొంత ఎఫెక్ట్ పడినట్లు అయింది.
సీటిమార్ రోజు వారీ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇలా ఉంది:
మొదటి రోజు: రూ. 2.98 కోట్లు
రెండో రోజు: రూ. 1.74 కోట్లు
మూడో రోజు: రూ. 1.51 కోట్లు
నాలుగో రోజు: రూ. 72 లక్షలు
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీటిమార్ రూ. 6.95 కోట్ల షేర్ ను రాబట్టినట్లు అయింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను దృష్టిలోకి తీసుకుంటే రూ. 7.29 కోట్లుగా ఉంది. ఇంకా ఈ చిత్రం విజయం సాధించాలంటే మరో 4 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కొంచెం కష్టమే. మొత్తంగా సీటిమార్ యావరేజ్ అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి.