Homeటాప్ స్టోరీస్మరో బోల్డ్ మూవీ సీత ఆన్ ది రోడ్

మరో బోల్డ్ మూవీ సీత ఆన్ ది రోడ్

Seeta on the road trailer talk బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగులో కూడా కొదవ లేకుండాపోయింది . యువతరానికి నచ్చేలా , యువత కోరుకునే అంశాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . తాజాగా ఆ కోవలోనిదే ” సీత ఆన్ ది రోడ్ ” చిత్రం . ప్రనీత్ యారోన్ అనే యువ దర్శకుడు చేసిన బోల్డ్ ప్రయత్నమే ఈ సీత . అయిదుగురు అమ్మాయిల జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సీత ఆన్ ది రోడ్ .

 

- Advertisement -

అయితే ఈ అయిదుగురు అమ్మాయిల్లో సీత ఎవరు ? వాళ్ళు ఎదుర్కొన్న సమస్యకు దొరికిన పరిష్కారం ఏంటి ? అన్నది మాత్రం తెరమీద చూడాల్సిందే . నిన్న సాయంత్రం సీత ఆన్ ది రోడ్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు . ట్రైలర్ లో బోల్డ్ కంటెంట్ తో యువతని ఆకర్షించే ప్రయత్నం చేసాడు దర్శకుడు . అయితే ఈ సమస్యలన్నీ ఇప్పుడు యువత ఎదుర్కొంటున్నదే కావడంతో తప్పకుండా ఆదరణ పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

English Title : Seeta on the road trailer talk

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All