Homeటాప్ స్టోరీస్కిడ్నప్ డ్రామా నేపథ్యంలో శీను వేణు ప్రారంభం

కిడ్నప్ డ్రామా నేపథ్యంలో శీను వేణు ప్రారంభం

Seenu Venu Villumanchi Kidneppers Movie Openingఅభిషేక్ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్ , మమతా శ్రీ హీరో హీరోయిన్లుగా రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుందర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ”శీను వేణు. వీళ్ళు మంచి కిడ్నపర్లు అన్నది ఉప శీర్షిక. ఈ చిత్రం శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్ లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్ కొట్టగా, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు ప్రేమ్ రాజ్ గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి మాట్లాడుతూ .. దర్శకుడు రవికి సినిమా అంటే ప్రాణం, ఇదివరకే దర్శకుడిగా , సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మంచి టైటిల్ తో ఆసక్తికర కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి ఈ టీమ్ అందరికి మంచి విజయాన్ని అందించాలని కోరు కుంటున్నాను అన్నారు.

- Advertisement -

హీరో అభిషేక్ మాట్లాడుతూ .. ఈ సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేస్తున్న రవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

మరో హీరో ప్రజ్వల్ మాట్లాడుతూ .. నేను కన్నడ అబ్బాయిని. ఈ సినిమాతో తెలుగు తెరకెకు పరిచయం అవుతున్నాను, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవి గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను తెలుగు ,కన్నడ ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ మధుప్రియ మాట్లాడుతూ .. నేను తెలుగు అమ్మాయినే .. ఈ చిత్రం ద్వారా నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన రవి గారికి థాంక్స్ .. తప్పకుండా మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

మరో హీరోయిన్ మమతా శ్రీ మాట్లాడుతూ .. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాము అన్నారు.

దర్శక నిర్మాత రవి ములకలపల్లి మాట్లాడుతూ .. వసుందర బ్యానర్ పై నా దర్శకత్వంలో నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. కిడ్నప్ డ్రామా నేపథ్యంలో కథ సాగుతుంది. ఇద్దరు పల్లేటూరి అమ్మాయిలను ముంబై గ్యాంగ్ కిడ్నప్ చేస్తుంది .. అప్పుడు వాళ్ళు ఆ గ్యాంగ్ నుండి ఎలా బయట పడ్డారన్న కథతో ఎంటర్ టైనేమేంట్ జోడించి తీస్తున్నాం. మొదటి షెడ్యూల్ ని 15 రోజులపాటు భద్రాచలం లో రేపటినుండి చిత్రీకరిస్తాం. అక్కడే మూడు పాటలు, 60 శాతం టాకీ కూడా పూర్తీ చేసి ఆ తరువాత రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లో జరిపి మూడో షెడ్యూల్ ని బెంగుళూర్ కి మారుస్తాం. వీలైనంత త్వరగానే సినిమాను విడుదల చేస్తామన్నారు.

జీవా, చిత్రం శీను, సుమన్ శెట్టి, ఏవి నారాయణ, మణికంఠ , మహేష్, సమోసా లలితా, నాగేశ్వర రావు, చరణ్, కృష్ణ తేజ్, రాక్ వేణు, సంతోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : శివార్ల కృష్ణ ప్రసాద్, పాటలు : లక్ష్మణ్ గంగ, సత్యం మాస్టారు, డేవిడ్ కూరగంటి,
కెమెరా : జి ఆర్యన్ ( ఏడుకొండలు ), ఎడిటింగ్ : శ్రీ శైలం, కొరియోగ్రఫి : రమేష్ కపిల్ మాస్టర్, సూర్య కిరణ్, ఆర్ట్: ఆనంద్, ఫైట్స్ : అవినాష్, కొ ఆర్డినేటర్ : జగన్, సంగీతం : కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : రవి ములకలపల్లి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All