Homeటాప్ స్టోరీస్ముందు అనుకుంది రూపాయి టాటూ కాదా‌!

ముందు అనుకుంది రూపాయి టాటూ కాదా‌!

ముందు అనుకుంది రూపాయి టాటూ కాదా‌!
ముందు అనుకుంది రూపాయి టాటూ కాదా‌!

మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.  మైత్రీ  మూవీమేక‌ర్స్‌, 14 ప్లాస్ రీల్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు మ‌హేష్ ప్రీ‌లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ప్రీలుక్‌లో మ‌హేష్ మెడ‌పై రూపాయి టాటూ, చెవికి పోగు, మాసిన గ‌డ్డంతో క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే మ‌హేష్ మెడిపై వున్న రూపాయి టాటూ వెన‌క ఇంట్రెస్టింగ్ స్టోరీ వున్న‌ట్టు చెబుతున్నారు. ముందు అనుకున్న క‌థ ప్ర‌కారం యుఎస్ నేప‌థ్యంలో 40 శాతం షూటింగ్‌ని ప్లాన్ చేశారు.
మ‌హేష్ మెడ‌పై డాల‌ర్‌ని టాటూగా వేయాల‌ని ముందు ప్లాన్ చేశారు.

- Advertisement -

వ‌చ్చే ఏడాది వ‌ర‌కు యుఎస్‌లో తెలుగు సినిమాల‌ షూటింగ్‌లు జ‌రిపే అవ‌కాశం లేక‌పోవ‌డంతో 40 శాంతం కీల‌క షెడ్యూల్‌ని కూడా ఇండియాకు మార్చేశార‌ట‌. దీంతో మెడ‌పై డాల‌ర్ టాటూ కాస్తా రూపాయి టాటూగా మార్చార‌ట‌. ఇండియ‌న్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో స్కామ్‌ల ఆధారంగా ఈ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఈ చిత్రానికి `స‌ర్కారు వారి పాట‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశార‌ని, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థపై సెటైరిక‌ల్‌గా ఈ సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All