Homeటాప్ స్టోరీస్`ఏక్ మినీ క‌థ‌` నుంచి సెకండ్ సింగిల్!

`ఏక్ మినీ క‌థ‌` నుంచి సెకండ్ సింగిల్!

`ఏక్ మినీ క‌థ‌` నుంచి సెకండ్ సింగిల్!
`ఏక్ మినీ క‌థ‌` నుంచి సెకండ్ సింగిల్!

సంతోష్ శోభ‌న్ న‌టించిన చిత్రం `ఏక్ మినీ క‌థ‌`. భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన యువీ క్రియేష‌న్స్ సంస్థ యువీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. `సైజ్ మ్యాట‌ర్‌` అనే విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి హిట్ ‌చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ క‌థ అందించారు.

కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతో మేకర్స్ ప్రమోషన్లను మెరుపు వేగంతో ప్రారంభించారు. ‘ఈ మాయలో..` అంటూ ఇటీవ‌లే ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేశారు. తాజాగా శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా సెకండ్ సింగిల్ లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.  మొదటి పాట అప్పటికే యూత్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు చిత్ర‌ యూనిట్ రెండవ పాటగా ‘సామిరంగ..’ అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేసింది.

- Advertisement -

ప్రవీణ్ లక్కరాజు అందించిన బాణీల‌కు గాయకుడు ప్రధ్వీ చంద్ర చ‌క్కిని గాత్రాన్ని అందించాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గోకుల్ భార‌తి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ర‌వీంద‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All