మార్చి 30న భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధిస్తున్న రంగస్థలం చిత్రాన్ని తమిళనాట తీసేస్తున్నారు . నిజంగా ఇది షాకింగ్ న్యూసే ఆ చిత్ర బృందానికి . తమిళనాట కూడా రంగస్థలం చిత్రం భారీ విజయాన్ని సాధిస్తోంది . ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వసూళ్ల ని సాధిస్తున్న చిత్రాన్ని తీసివేయడం ఏంటా ? అని అనుకుంటున్నారా ? అక్కడ బాగానే వసూళ్ల ని సాధిస్తోంది కానీ తమిళనాట డిజిటల్ ప్రొవైడర్ల తీరుతో సమ్మె జరుగుతోంది .
డిజిటల్ ప్రొవైడర్ల సమ్మె కారణంగా తమిళ సినిమాల విడుదల ఆగిపోయాయి కానీ తెలుగు చిత్రాలు మాత్రం విడుదల అయ్యాయి . అందునా రంగస్థలం భారీ వసూళ్ల ని సాధిస్తోంది . అయితే తమిళ చిత్రాలు విడుదల కాకుండా తెలుగు చిత్రాలను రిలీజ్ చేయడం భావ్యం కాదని తమిళ నిర్మాతల మండలి తెలుగు సినిమా రంగాన్ని కోరింది దాంతో రంగస్థలం చిత్రాన్ని నిలిపివేయడానికి ఒప్పుకున్నారు . అలా రంగస్థలం చిత్రాన్ని అక్కడ తీసేస్తున్నారు .