
`కంచె` సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది ప్రగ్యాజైస్వాల్. కానీ ఆ స్థాయిలో అవకాశాల్ని మాత్రం పొందలేకపోతోంది. తాజాగా ఆమెకు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. బోయపాటి కూడా ఫైనల్ చేయాలనుకున్నారట. కానీ చివరి నిమిషంలో ప్రగ్యాని కాకుండా సయేషా సైగల్‌ని ఫైనల్ చేశారు.
ఈ రోజు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కలయికలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్ కావడంతో ఈ చిత్రంపై బారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత కొన్ని నెలలుగా బాలకృష్ణ సరసన నటించే ఇద్దరు హీరోయిన్‌ల కోసం అన్వేషణ మొదలుపెట్టిన బోయపాటి పూర్ణతో పాటు ప్రయాగ మార్టీన్‌ని ఎంపిక చేశారు.
అయితే తొలి రోజు ట్రైయల్ షూట్ సంతృప్లికరంగా రాకపోవడంతో ప్రగ్యా మార్టీన్‌ని తప్పించి ఆమె స్థానంలో సయేషా సైగల్ ని ఫైనల్ చేశారు. అఖిల్ హీరోగా పరిచయమైన `అఖిల్` మూవీతో సయేషా సైగల్ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో హీరనో నితిన్ నిర్మించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సయేషా సైగల్ కు తెలుగులో మరో అవకాశం దక్కలేదు. ఇటీవల సూర్యతో కలిసి `బందోబస్తు`లో నటించినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది.