Homeటాప్ స్టోరీస్అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్

అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్

అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్
అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్

సినిమా ఇండస్ట్రీలో ఎవరి రేంజ్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ ఎప్పటినుండో సినిమాల్లో ఉన్నా కానీ 50వ వడిలో పడితే కానీ బ్రేక్ రాలేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పరిస్థితి కూడా అంతే. ఇక హీరోలుగా ఉన్నప్పుడు బ్రేక్ రాని వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక ఒక వెలుగు వెలిగిన సందర్భాలు మనం చాలా చూసాం. అలాగే హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలిన వారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దొరక్కపోవడమూ చూసాం. జగపతి బాబునే తీసుకుంటే.. హీరోగా మంచి ఇమేజ్ ఉన్న జగపతి బాబు, క్రమంగా మార్కెట్ కోల్పోతూ వచ్చాడు. అయితే సరైన సమయంలో తన పరిస్థితి తెలుసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. లెజండ్ లో విలన్ గా చేయడంతో తన కెరీర్ స్వరూపమే మారిపోయింది. హీరోగా అందుకోనంత పారితోషకాల్ని కూడా తక్కువ డేట్స్ మాత్రమే ఇచ్చి క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా అందుకుంటున్నాడు జగ్గూ భాయ్.

ప్రస్తుతం జగపతి బాబు లానే తెలుగులో, ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సత్యరాజ్ అనే చెప్పాలి. మిర్చి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్ రేంజ్ బాహుబలి సిరీస్ తో అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాలో కట్టప్ప పాత్రతో అందరి మనస్సుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నాడు సత్యరాజ్. హీరోగా తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన సత్యరాజ్ కు ఇప్పుడున్నంత డిమాండ్ అప్పుడు లేదు. ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో సగం కూడా అప్పుడు హీరోగా ఆయన అందుకోలేదంటే ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో చుడండి.

- Advertisement -

ఇప్పుడు సత్యరాజ్ ను సినిమాల్లో పెట్టుకోవాలంటే 2 నుండి రెండున్నర కోట్ల మధ్య పారితోషికం సమర్పించుకోవాల్సిందే. అదనంగా డబ్బింగ్ కు మరో 10 నుండి 15 లక్షలు అవుతాయి. అంత పెట్టి సత్యరాజ్ ను పెట్టుకున్నప్పుడు బలమైన పాత్రలే అతనికి ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కానుండడం నిజంగా విశేషమే.

సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్ కు తాతగా నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇందులో హీరో పాత్ర తర్వాత హైలైట్ అయ్యేది సత్యరాజ్ పాత్రే కావడం విశేషం. అలాగే కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో కనిపించనున్న దొంగ చిత్రంలో కూడా సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. పోస్టర్లలో కూడా వీరి ముగ్గురిని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 20నే విడుదలయ్యే అవకాశాలున్నాయి. సత్యరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని నటన, మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All