
తెలుగులో వెబ్ సిరీస్ కు ఇంకా పూర్తిగా ఊపందుకోని సమయంలో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డ్, ఆహాలో వచ్చిన తొలి వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. అయితే అప్పట్లో సరైన ప్రచారం లేక మరొకటో కానీ లాక్డ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ కంటెంట్ విషయంలో మాత్రం లాక్డ్ ఇంప్రెస్ చేస్తుంది.
ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ రాబోతోంది. లాక్డ్ కు సెకండ్ సీజన్ వస్తోన్న విషయాన్ని అధికారికంగా తెలియజేసారు. సత్యదేవ్ ఆసక్తికరంగా సంభాషణ మొదలుపెట్టి లాక్డ్ సెకండ్ సీజన్ ను ప్రకటించాడు. లాక్డ్ సీజన్ 1 లో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ గా సత్యదేవ్ కనిపిస్తాడు.
మొదటి సీజన్ లో సత్యదేవ్ తో పాటు సంయుక్త, శ్రీలక్ష్మిలు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే సెకండ్ సీజన్ లో కాస్ట్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. సత్యదేవ్ తిమ్మరసు చిత్రాన్ని పూర్తి చేసాడు. గుర్తుందా శీతాకాలం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంత బిజీలో కూడా వెబ్ సిరీస్ చేయడానికి సమయం కేటాయించాడు సత్యదేవ్.
You made the first season great with your love and support. Now it’s time to unleash the monster for the second time. #locked chapter 2 is coming your way. Pre-production starts soon. @pradeepdevakum1 @ahavideoIN pic.twitter.com/O1Sf4fP0mP
— Thimmarusu (@ActorSatyaDev) July 22, 2021