
షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా తన సినీ కెరియర్ ను ప్రారంభించిన సత్యదేవ్.. 2011 లో మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రంలో చిన్న పాత్రలో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుంద వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020 లో నె ట్ఫ్లిక్స్ లో విడుదలైన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం లో ఉమా మహేశ్వర రావు గా నటించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇలా మొదటి నుండి విభిన్న పాత్రలతో మెప్పిస్తున్న వస్తున్న సత్యదేవ్..తాజాగా గాడ్సే చిత్రంతో మే 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సి.కే.స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, గోపి గణేష్ పట్టాభి డైరెక్ట్ చేసాడు.
ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సత్యదేవ్, గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన” బ్లఫ్ మాస్టర్” చిత్రం ఇటు ప్రేక్షకుల ఆదరణను, అటు విమర్శకుల ప్రశంశలనుఅటు అమితంగా పొందింది.అలాంటి క్లాసిక్ మూవీ తర్వాత సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ గా గాడ్సే తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.