
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా నటిస్తున్న చిత్రం `కోతికొమ్మచ్చి`. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తూ `శతమానం భవతి`వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ని అందించి జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకున్న వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్. వి. సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నీ చిత్రం విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తొలి షాట్‌కు క్లాప్ నివ్వగా హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ `యూత్‌ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినాన ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలుపెడతాం. ఆ తరువాత వైజాగ్‌లో కొంత పార్ట్ షూటింగ్ చేయబోతున్నాం. ఒకే షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు.
నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ `సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్నసతీష్‌గారు మా సంస్థలో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా వుంది. మేఘాంశ్, సమీర్‌లకు ఈ మూవీ కచ్చితంగా మంచి విజయాన్ని అందిస్తుంది` అని తెలిపారు. రిద్దికుమార్, మేఘ చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.