Homeటాప్ స్టోరీస్థియేటర్స్ లలో సర్కారు వారి ట్రైలర్ ..

థియేటర్స్ లలో సర్కారు వారి ట్రైలర్ ..

Sarkaru vaari paata trailer in theaters
Sarkaru vaari paata trailer in theaters

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను మే 2 న రిలీజ్ చేయబోతున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్ల లో ఈ మాస్ ట్రైలర్ ను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా తాలూకా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All