
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో మాస్ సాంగ్ షూటింగ్ తో సినిమా అంత పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీ తెలుపుతూ చిత్ర యూనిట్ యాక్షన్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా తాలూకా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..శనివారం సినిమాలోని మూడో సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.