
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మహేష్ కెరీర్ లోనే కల్ట్ హిట్ గా నిలిచిన అతడు సినిమా స్టోరీని పోలి ఉంటుందని అంటున్నారు. ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న మహేష్ యుద్ధంలో తన స్నేహితుడు మరణిస్తే ఆ స్నేహితునిగా వెళ్లి విజయశాంతిని కలుస్తాడట.
సరిగ్గా అతడులో కూడా ఇదే ఉంటుంది. తన వల్ల చనిపోయిన రాజీవ్ కనకాల ఇంటికి తనలా వెళ్లి అక్కడి వాళ్లతో కలిసిపోతాడు మహేష్. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఇదే స్టోరీ లైన్ తో ఉంటుందని అంటున్నారు. విజయశాంతికి, మహేష్ స్నేహితుడికి ఉన్న రిలేషన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అట. విజయశాంతి ఈ చిత్రంలో రాయలసీమ రాజకీయవేత్తగా కనిపించబోతోంది.
స్టోరీ రొటీన్ గా అనిపిస్తోంది కానీ మహేష్ బాబు, అనిల్ రావిపూడిపై తన నమ్మకాన్ని ఉంచాడట. కమర్షియల్ హంగులతో సినిమాను జనాలకు నచ్చేలా తీర్చిదిద్దడంలో అతను స్పెషలిస్ట్. ఈ నమ్మకంతోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి నిజంగానే అనిల్ రావిపూడి మ్యాజిక్ చేయగలడా?