Homeటాప్ స్టోరీస్సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం అసలు ఎక్కడా తగ్గేలా కనిపించట్లేదు. సంక్రాంతి మొదలుకాకుండానే దుమ్ము రేపిన సరిలేరు నీకెవ్వరు నిన్న భోగి కావడంతో పండగ అడ్వాంటేజ్ ను ఫుల్లుగా క్యాష్ చేసుకుంది. మొదటిరోజు 32.64 కోట్ల కలెక్షన్స్ తో భారీగా మొదలుపెట్టిన ఈ సినిమా రెండో రోజు 9.4 కోట్ల రూపాయల షేర్ తో బాగానే స్టాండ్ అయింది. మూడో రోజు సోమవారం కావడంతో 7.21 కోట్ల కలెక్షన్స్ తో కొంచెం డౌన్ అయినట్లు అనిపించింది. అయితే మళ్ళీ భోగితో సరిలేరు నీకెవ్వరు పుంజుకుంది. నాలుగో రోజు ఈ సినిమా తిరిగి 9 కోట్ల షేర్ ను సాధించింది. దీంతో నాలుగు రోజుల కలెక్షన్స్ టోటల్ 58.3 కోట్లకు చేరుకుంది.

మరోవైపు యూఎస్ లో కూడా ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ మార్క్ వైపు పరుగులు పడుతోంది. ప్రస్తుతం 1.75 మిలియన్ డాలర్స్ సాధించింది. ఇక ఈరోజు, రేపు కూడా పండగ సెలవులు ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో సాగడంతో సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి నిజమైన పండగ చేసుకోనుంది. చూస్తుంటే ఈ ఆదివారం వరకూ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఎదురే లేదని చెప్పొచ్చు.

- Advertisement -

పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బి, సి సెంటర్స్ లో చెలరేగిపోతోంది. ఏ సెంటర్స్ లో కూడా బాగుందనే రేంజ్ లోనే కలెక్షన్స్ సాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినట్లే.

సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం : 19.04 కోట్లు
సీడెడ్ : 7.99 కోట్లు
గుంటూరు : 6.7 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.02 కోట్లు
తూర్పు గోదావరి : 5.35 కోట్లు
పశ్చిమ గోదావరి : 4.05 కోట్లు
కృష్ణా : 5.01 కోట్లు
నెల్లూరు : 2.14 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 58.3 కోట్ల షేర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All