
భారతదేశంలో స్వతంత్ర సమరయోధులంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు గుర్తొస్తారు. అయితే ఇంకా ఎంతో మంది బానిస సంకెళ్ల నుండి భరతమాతకు విముక్తి ప్రసాదించడానికి ప్రయత్నించారు. వారిలో చాలా మందిని చరిత్ర మరిచిపోతోంది.
అయితే మన దర్శకులు, నిర్మాతలు ఎప్పటికప్పుడు అలాంటి వారి గురించి అద్భుతమైన, స్ఫూర్తివంతమైన గాధలను మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటి ఒక సినిమానే సర్దార్ ఉద్ధం. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని సూజిత్ సర్కార్ డైరెక్ట్ చేసాడు.
జలియన్ వాలా బాగ్ ఉదంతం భారతదేశ చరిత్రలోనే ఒక మాయని మచ్చ. వందల మంది అమాయకపు భారతీయులను జనరల్ డయ్యర్ నేతృత్వంలోని టీమ్ విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఉదంతంతో చలించిన సర్దార్ ఉద్ధం సింగ్, బ్రిటిష్ గడ్డపై అడుగు పెట్టి వాళ్ళ గుండెల్లోనే రైళ్లు పరిగెత్తించాడు. ఈ సినిమా అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. ట్రైలర్ చూస్తుంటే అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తోంది. దేశం కోసం అప్పటి మహానుభావులు ఎంతటి త్యాగాలకైనా ఎలా వెనుకాడకుండా ముందడుగు వేశారో తెలుసుకుంటుంటే ఎవరికైనా ఒళ్ళు పులకరిస్తుంది కదా.
