Homeటాప్ స్టోరీస్సప్తగిరి చేస్తోంది తప్పా ? ఒప్పా ?

సప్తగిరి చేస్తోంది తప్పా ? ఒప్పా ?

Saptagiri hopes on Vajrakavachadhara govinda
Saptagiri hopes on Vajrakavachadhara govinda

ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి హీరోగా నటించిన ”వజ్ర కవచధర గోవింద ” చిత్రం ఈనెల 14 న విడుదలకు సిద్ధమైంది . అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సప్తగిరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఎంటర్ టైన్ మెంట్ కు యాక్షన్ ని జోడించి చేసిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నారు హీరో సప్తగిరి అలాగేదర్శకుడు అరుణ్ పవార్ . ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రం వచ్చింది .

ఆ సినిమా బయ్యర్లకు పెట్టిన పెట్టుబడి తీసుకురావడమే కాకుండా లాభాలను కూడా తెచ్చిపెట్టింది దాంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి . అయితే హాయిగా హాస్య నటుడిగా కెరీర్ సాగిపోతున్న సమయంలో హీరోగా మారి కెరీర్ నాశనం చేసుకుంటున్నాడా ? అన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో సప్తగిరి చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All