Homeటాప్ స్టోరీస్సంతోష్ శోభన్ ఈసారి ప్రేమ్ కుమార్!!!

సంతోష్ శోభన్ ఈసారి ప్రేమ్ కుమార్!!!

సంతోష్ శోభన్ ఈసారి ప్రేమ్ కుమార్!!!
సంతోష్ శోభన్ ఈసారి ప్రేమ్ కుమార్!!!

ఏక్ మినీ కథ చిత్రంతో సంతోష్ శోభన్ కు బ్రేక్ దొరికినట్లుంది. సంతోష్ శోభన్ టాలెంటెడ్ నటుడన్న విషయం తెల్సిందే. కాకపోతే తనకు సరైన బ్రేక్ దొరకలేదు. చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏక్ మినీ కథ మాత్రం సంతోష్ కెరీర్ కు బాగానే ఉపయోగపడింది. బోల్డ్ కాన్సెప్ట్ ను డీసెంట్ గా హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులకు నచ్చింది. అలాగే సంతోష్ శోభన్ నటన కూడా మెప్పించింది.

ఈరోజు సంతోష్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ అయింది. ఏక్ మినీ కథ తర్వాత ప్రేమ్ కుమార్ గా మారిపోయాడు తన హీరో. పెళ్లి కాన్సెప్ట్ చుట్టూ తిరిగే పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ ఈ చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పన్నీరు శివ ప్రసాద్ ఈ కామెడీ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నాడు.

- Advertisement -

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. మరి ఏక్ మినీ కథ ఇచ్చిన బ్రేక్ ను ఉపయోగించుకుని ప్రేమ్ కుమార్ గా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All