Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్సంజు రివ్యూ

సంజు రివ్యూ

sanju movie reviewసంజు రివ్యూ :
నటీనటులు : రణబీర్ కపూర్ ,మనీషా కోయిరాలా , అనుష్క శర్మ
సంగీతం : ఏ ఆర్ రెహ్మాన్
నిర్మాతలు : విదు వినోద్ చోప్రా , రాజ్ కుమార్ హిరాణీ
దర్శకత్వం : రాజ్ కుమార్ హిరాణీ
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 29 జూన్ 2018

బాలీవుడ్ లో బయోపిక్ లు సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ” సంజు ”. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

వారసుడిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతాడు సంజు ( రణ్ బీర్ కపూర్ ) . మొదటి చిత్రంతోనే స్టార్ డం అందుకుంటాడు అయితే అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలోనే తల్లి మరణం , డ్రగ్స్ కి అలవాటు పడటం , మద్యం , మగువ లతో కెరీర్ డోలాయమానం లో పడుతుంది అదే సమయంలో అక్రమాయుధాల కేసు సంజు మెడకు చుట్టుకుంటుంది . సంజు కెరీర్ ఎలా సాగింది ? ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయి ? చివరకు ఏమైంది ? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రణ్ బీర్ కపూర్ నటన
ఛాయాగ్రహణం
దర్శకత్వ ప్రతిభ

డ్రా బ్యాక్స్ :
స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :

ట్రైలర్ లోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో తన నటనతో చెప్పకనే చెప్పాడు రణ్ బీర్ కపూర్ . కెరీర్ మొత్తంలోనే ” ది బెస్ట్ ” పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు రణ్ బీర్ కపూర్ . సంజయ్ దత్ జీవితం అంటేనే విభిన్న కోణాల నేపథ్యం అయితే అది చెప్పడం ఈజీ కానీ చేసి చూపించడం చాలా చాలా కష్టం ఆ కష్టాన్ని అద్వితీయంగా పోషించి రియల్ సంజయ్ దత్ ఇతడేనేమో అనిపించాడు రణ్ బీర్ కపూర్ . తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావెల్ నటన అద్భుతం , సంజయ్ భార్య మాన్యత పాత్రలో దియా మీర్జా అభినయం ఆకట్టుకుంది , మనీషా కోయిరాలా నర్గీస్ దత్ పాత్ర పోషించింది అయితే ఆమెకు పెద్దగా నటనకు అవకాశం లేకుండా పోయింది కానీ ఉన్నంతలో బాగానే మెప్పించింది . అనుష్క శర్మ , సోనమ్ కపూర్ లు కూడా తమతమ పాత్రలకు న్యాయం చేసారు . ఇక చివరలో సంజయ్ దత్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కనిపించడం మరో హైలెట్ .

ఓవరాల్ గా :

రాజ్ కుమార్ హిరాణీ సంజయ్ దత్ కు మంచి స్నేహితుడు కావడంతో కాస్త లిబరల్ గానే వ్యవహరించాడు . ఆ కుటుంబం తో ఉన్న చనువు కొద్దీ స్వేచ్ఛ తీసుకొని మరీ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు . సంజయ్ దత్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తీసుకొని ప్రేక్షకులను ఏడిపించి , నవ్వించి , కవ్వించి మొత్తంగా మెప్పించాడు . భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన సంజు చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిన చిత్రంగా మలిచాడు రాజ్ కుమార్ హిరాణీ .

English Title:Sanju Movie Review

                           Click here for English Review

 

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts