
సంజయ్‌దత్.. ముంబై పేలుళ్ల కేసులో అనుమానితుడు.. అక్కమ ఆయుధాలు కలిగి వున్న వ్యక్తిగా టాడా కేసులో అరెస్టై ఆ తరువాత బయటికి వచ్చిన స్టార్.. ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్‌దత్ గురించి చాలా పెద్ద హిస్టరీనే వుంది. సునీల్‌దత్, నర్గీస్‌ల గారాల తనయుడిగా పేరున్నా అందుకు భిన్నమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి సంజయ్. నిత్యం సంచలనాలతో వార్తల్లో నిలచిని సంజయ్‌దత్ మరోసారి క్యాన్స్ కారణంగా వార్తల్లో నిలిచారు.
ఇటీవల లంగ్ క్యాన్స్ అని తేలడంతో సంజయ్‌కి డాక్టర్లు అత్యవస ట్రీట్‌మెంట్ అవసరమని ఇటవల తొలి రౌండ్ కీమో థెరపీ చేసిన విషయం తెలిసిందే. రెండవ రౌండ్ కీమో థెరపీ కోసం మరోసారి సంజయ్‌దత్ హాస్పిటల్ వెళ్లనున్నారు. ఈ లోగా దుబాయ్‌లో స్ట్రక్కయిన తన పిల్లల్ని కలుసుకోవడానికి సంజయ్, అతని భార్య మాన్యత ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లో పిల్లలతో కలిసి సంజు తీసుకున్న ఓ ఫొటో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. కీమో థెరపీ చేయించుకుంటున్న సంజు చాలా మారిపోయాడు.
ముఖం మారింది. కళ్లు లోపలికి పోయాయి. భారీగా భీకరంగా కనిపించే సంజయ్ ఆహార్యం ఒక్కసారిగా మారిపోయింది. సంజూ చాలా డల్‌గా కనిపిస్తున్న తీరు అభిమానుల్ని ఆందోనకు గురిచేస్తోంది. అయితే సంజు వర్గం మాత్రం ఆయన చాలా చలాకీగా వున్నారని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని వెల్లడిస్తున్నారు.