Saturday, January 28, 2023
Homeటాప్ స్టోరీస్కేజిఎఫ్ 2: సంజయ్ దత్ వైకింగ్స్ లుక్ అదిరిపోయిందిగా

కేజిఎఫ్ 2: సంజయ్ దత్ వైకింగ్స్ లుక్ అదిరిపోయిందిగా

కేజిఎఫ్ 2: సంజయ్ దత్ వైకింగ్స్ లుక్ అదిరిపోయిందిగా
కేజిఎఫ్ 2: సంజయ్ దత్ వైకింగ్స్ లుక్ అదిరిపోయిందిగా

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ 2 లో విలన్ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. సంజయ్ దత్ తొలిసారి సౌత్ సినిమాలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇందులో సంజయ్ అధీరా అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ లో అధీరా గురించి చర్చ వచ్చినా కానీ సెకండ్ పార్ట్ లోనే ఎంటర్ అవ్వనుంది.

- Advertisement -

ఇక ఈ ఫస్ట్ లుక్ విషయానికొస్తే అదిరిపోయిందని చెప్పాలి. రాకీ భాయ్ ను ఢీ కొట్టగలిగే పాత్రలానే అధీరా పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ లుక్ ను వైకింగ్స్ అనే ప్రముఖ టివి సిరీస్ లోని ఒక పాత్ర లుక్ స్పూర్తితో డిజైన్ చేసినట్లు అర్ధమవుతోంది. తనకిది బెస్ట్ పుట్టినరోజు గిఫ్ట్ అని సంజయ్ దత్ ట్విట్టర్ లో స్పందించడం విశేషం.

కేజిఎఫ్ చాప్టర్ 2 ను మొదట అక్టోబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాదికి విడుదల షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. యష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts