Sunday, September 25, 2022
Homeగాసిప్స్సందీప్ వంగ `డెవిల్‌` పేరు మారిందా?

సందీప్ వంగ `డెవిల్‌` పేరు మారిందా?

సందీప్ వంగ `డెవిల్‌` పేరు మారిందా?
సందీప్ వంగ `డెవిల్‌` పేరు మారిందా?

టాలీవుడ్‌లో `అర్జున్‌రెడ్డి`తో పాథ్‌బ్రేకింగ్ హిట్‌ని అందించి వార్త‌ల్లో నిలిచారు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీ త‌రువాత ఇండ‌స్ట్రీలో హాట్ ఫేవ‌రేట్‌గా నిలిచిన ఈ ద‌ర్శ‌కుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో షాహీద్ క‌పూర్‌తో `క‌బీర్‌సింగ్‌` పేరుతో తెర‌కెక్కించి అక్క‌డా సంచ‌ల‌నం సృష్టించారు. భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఈ మూవీ రాత్రికి రాత్రే షాహీద్‌క‌పూర్ రెమ్యున‌రేష‌న్‌ని 30 కోట్ల‌కు పెంచేసింది.

- Advertisement -

ఈ మూవీ ఫ‌లితంతో బాలీవుడ్ హీరోల దృష్టిని ఆక‌ర్షించారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో సందీప్ వంద సినిమా వుంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. `డెవిల్‌` పేరుతో ఈ మూవీ వుంటుంద‌ని త్వ‌ర‌లోనే ఇది ప్రారంభం అవుతుంద‌ని బాలీవుడ్‌లో వార్త‌లు షికారు చేశాయి. కానీ ఇంత వ‌ర‌కు ఆ మూవీకి సంబంధించిన ఎలాంటి క‌ద‌లిక లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం సందీప్ రెడ్డి వంగ‌తో మూవీ చేయ‌డానికి ర‌ణ్‌బీర్ కపూర్ సుముఖంగా వున్నార‌ని తెలిసింది.

అయితే ఈ మూవీ టైటిల్‌ని కాస్త `యానిమ‌ల్‌` అని మార్చిన‌ట్టు చెబుతున్నారు. `డెవిల్‌` టైటిల్‌ని స‌ల్మాన్‌ఖాన్ రిజిస్ట‌ర్ చేసుకోవ‌డంతో సందీప్‌రెడ్డి వంగ `యానిమ‌ల్‌` టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. ఈ భారీ చిత్రాన్ని టీసిరీస్ సంస్థ నిర్మించ‌నుంద‌ని తెలిసింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts