Homeటాప్ స్టోరీస్సందీప్ కిష‌న్ రౌడీ బేబీ కాదు గ‌ల్లీరౌడీ!

సందీప్ కిష‌న్ రౌడీ బేబీ కాదు గ‌ల్లీరౌడీ!

సందీప్ కిష‌న్ రౌడీ బేబీ కాదు గ‌ల్లీరౌడీ!
సందీప్ కిష‌న్ రౌడీ బేబీ కాదు గ‌ల్లీరౌడీ!

విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంంత చేసుక‌రుంటున్నారు యంగ్ హీరో సందీప్ కిష‌న్ . ఇటీవ‌ల `ఏ1 ఎక్స్‌ప్రెస్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని స‌క్సెస్‌ని త‌న ఖాతాలో వేసుకున్న సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా క‌ల‌యిక‌లో ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ న‌టుడు బాబీ సింహా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముందు `రౌడీ బేబీ` టైటిల్ అనుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ టైటిల్‌ని ప‌క్క‌న పెట్టి ఈ చిత్రానికి `గ‌ల్లీరౌడీ` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. ఈ సంద‌రంగా ఈ చిత్ర టైటిల్ వీడియోని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని, శివ నిర్వాణ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

- Advertisement -

స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఫ‌న్ ఏమాత్రం త‌గ్గ‌ద‌ని, జి. నాగేశ్వ‌ర‌రెడ్డి మార్కు వినోదం వుంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు నిర్మాత‌లు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All