Homeటాప్ స్టోరీస్తెలుగులో వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సముద్రఖని

తెలుగులో వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సముద్రఖని

తెలుగులో వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సముద్రఖని
తెలుగులో వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సముద్రఖని

ముందు దర్శకుడిగా సత్తా చాటి ఆపై తమిళ సినిమాల్లో నటుడిగా నిరూపించుకున్న సముద్రఖని ఇప్పుడు తెలుగు చిత్రాల్లో ఫుల్ బిజీగా మారిపోయాడు. తెలుగులో వరసగా టాప్ చిత్రాలను కైవసం చేసుకుంటున్నాడు సముద్రఖని. రీసెంట్ గా అల వైకుంఠపురములో, క్రాక్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ నటుడు కమ్ దర్శకుడు. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

రీసెంట్ గా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్ర పోషించాడు సముద్రఖని. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కూడా మంచి పాత్ర చేజిక్కించుకున్నాడు. అలాగే తేజ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రంలో కూడా సముద్రఖని నటిస్తున్నాడు. ఇంకా రెండు, మూడు చిత్రాలు డిస్కషన్ దశల్లో ఉన్నాయి.

- Advertisement -

అటు నెగటివ్, ఇటు పాజిటివ్ రోల్స్ ను అంతే ఎఫెక్టివ్ గా పోషించగల సముద్రఖని టాలీవుడ్ లో టాప్ స్థాయికి చేరాలని అనుకుంటున్నాడు. తెలుగులో సినిమాలకు తోడు తన తమిళ చిత్రాలు ఉండనే ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All