Friday, September 30, 2022
Homeన్యూస్Press Release: 'సముద్రుడు' నూతన చిత్ర ప్రారంభోత్సవం...

Press Release: ‘సముద్రుడు’ నూతన చిత్ర ప్రారంభోత్సవం…

Samudrudu Movie Opening
Samudrudu Movie Opening

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ బాధావత్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘సముద్రుడు’. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఈ నూతన చిత్రానికి క్లాప్ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ ఇవ్వగా, గౌరవ దర్శకత్వం సముద్ర వహించగా.. కెమెరా స్విచ్ ఆన్ ముత్యాల రామదాసు చేయగా..

- Advertisement -

అతిథి మల్టి డిమెన్షనల్ వాసు పూజ కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఈ చిత్ర దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ… సముద్రుడు చిత్రం పూర్తిగా సముద్రం, మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ గా మాస్ కి చేరువయ్యేలా ఉంటుంది. ప్రాణాలతో చెలగాటాలాడుతూ నిత్యం కష్టాలు అనుభవిస్తున్న జాలర్ల జీవితాలకు అనుకోని అదృష్టం కలసి వస్తున్న సమయంలో వారికి ఏ విధమైన ఆపద వచ్చింది దాన్ని హీరో గంగరాజు పాత్ర ఎలా పరిష్కరించగలిగాడు అనే పాయింట్ తో

వినోదాత్మకంగా కమర్షియల్ లో యాక్షన్ సన్నివేశాలతో అందర్నీ అలరించే రీతిలో ఈ చిత్రాన్ని మలుస్తున్నాం.. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు నిర్మాతలు సహకారం చాలా అవసరం ఆలాంటి సహకారాన్ని నాకు ఈ చిత్ర నిర్మాతలు అందించారు అని అన్నారు.

సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ: నేను ఇదివరకే నగేష్ డైరెక్షన్ లో శ్రీ సత్యన్నారాయణ వ్రతం అనే సినిమాలో ఏకంగా 5 పాత్రలు చేసాను. తను చాలా ప్లానింగ్ ఉన్న దర్శకుడు. చాలా కంఫోర్టబుల్ డైరెక్టర్ కూడా.. అందుకే తనతో సినిమా అంటే మళ్లీ అంగీకరించాను. ఈ సముద్రుడు లో పోలీసు ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నా.. హీరో రమాకాంత్ ఈ స్టోరీ కు పక్కా యాప్ట్. అందరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు.

హీరో రమాకాంత్ మాట్లాడుతూ:  ఆరు నెలలు ఈ సినిమా కథపై హార్డ్ వర్క్ చేసాడు దర్శకుడు నగేష్. నాకు చాలా నచ్చింది స్క్రిప్ట్. అన్ని రకాల ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమా లో నటిస్తున్నారు అన్నారు.

హీరోయిన్ మొనాల్ మాట్లాడుతూ: సముద్రుడు నా రెండో చిత్రం. మంచి స్క్రిప్ట్. నాకు బాగా నచ్చింది కూడా… చాలా హోప్ తో ఉన్నాం.. ఆదరించండి అని అన్నారు.

మరో హీరోయిన్ సిమర్ మాట్లాడుతూ: టీచర్ పాత్ర పోషిస్తున్నా.. నా పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది.. అందరికి నచ్చేలా తెరకెక్కించారు దర్శకుడు అని అన్నారు.

బేబీ కీర్తన, రాజ్యలక్ష్మి, షేకింగ్ శేషు, తుమ్మల పల్లి రామసత్యనారాయణ, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, చిత్రం శీను, ప్రభావతి, రామరాజు, సుమన్ శెట్టి తదితరులు ఈ నూతన చిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

రమాకాంత్, మోనల్, సీమర్, సుమన్, శ్రవణ్, రామరాజు, శివ శంకర మాస్టర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: సుభాష్ ఆనంద్, ఫైట్స్: సిందూరం సతీష్, డాన్స్: అనీష్, మాటలు: పార్వతి చంద్, ఆర్ట్: గిరి, కాస్ట్యూమ్స్: ఏడుకొండలు, మేకప్: రాంబాబు, నిర్మాత: బాదావత్ కిషన్, కథ-స్క్రీన్ – ప్లే- దర్శకత్వం: నగేష్ నారదాశి.

Press release by: Indian Clicks, LLC

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts