Homeటాప్ స్టోరీస్సంపూ ని ఘోరంగా తిట్టారట !

సంపూ ని ఘోరంగా తిట్టారట !

sampoornesh babu latest news
sampoornesh babu latest news

వెండితెర పై సంపూర్ణేష్ బాబు చేస్తున్న లీలలు అన్నీ ఇన్ని కాదు . హృదయ కాలేయం అంటూ సెటైరికల్ కామెడీ చిత్రంతో టాలీవుడ్ ని షేక్ చేసిన హీరో సంపూ , అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వీడేంటి ? హీరో ఏంటి ? అంటూ ఘోరంగా బూతులు తిట్టారట . అంతేనా కొంతమంది అయితే ఫోన్ చేసి చేసి తిట్టడమే కాకుండా కొడతామని హెచ్చరికలు కూడా చేశారట . ఆ సమయంలో సంపూ చాలా బాధపడ్డాడట .

దాదాపుగా కుమిలి కుమిలి ఏడ్చాడట ! అయితే ఎప్పుడైతే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేసాడో అప్పుడు తన బాధనంతా మర్చిపోయానని , ఆ విమర్శలను లైట్ గా తీసుకున్నానని అంటున్నాడు . ఇక ఈ హీరో తాజగా నటించిన కొబ్బరిమట్ట ఈనెల 10 న విడుదల అవుతోంది దాంతో తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు సంపూ . హృదయ కాలేయం సంచలనం సృష్టించింది , ఇక ఈ కొబ్బరిమట్ట ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈనెల 10 న తేలిపోనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All