Homeగాసిప్స్రాజమౌళి సినిమా సీక్వెల్ కు సంపత్ నంది దర్శకత్వం?

రాజమౌళి సినిమా సీక్వెల్ కు సంపత్ నంది దర్శకత్వం?

sampath nandi to get opportunity of directing vikramarkudu sequel
sampath nandi to get opportunity of directing vikramarkudu sequel

దర్శకుడు సంపత్ నంది పక్కా కమర్షియల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. తన కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగినా కానీ రీసెంట్ గా వచ్చిన సీటిమార్ తో సంపత్ నంది తనలోని మాస్ యాంగిల్ ను బయటకు చూపించాడు. ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.

అయితే సంపత్ నందికి మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సంపత్ నందికి ఒక భారీ చిత్ర ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విక్రమార్కుడు సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి. ఆ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు సీక్వెల్ పై వర్క్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

- Advertisement -

రవితేజ తెలుగు వెర్షన్ లో నటిస్తుండగా హిందీ వెర్షన్ లో అక్షయ్ కుమార్ నటిస్తాడు. అయితే ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయబోవట్లేదు. ఈ చిత్ర సీక్వెల్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఇప్పుడు సంపత్ నందిని వరించినట్లు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All