
సమంత వెబ్ సిరీస్ ఎంట్రీ అదిరిపోయింది. ఓ రేంజ్ లో పేలింది. కొంత కాంట్రవర్సీ నడిచినా కానీ సమంత పెర్ఫార్మన్స్ కు అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం వస్తోంది. రాజి పాత్రలో సమంత ఒదిగిపోయిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే సమంతకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుండి బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ తో ఆమె ఒక భారీ డీల్ ను ఓకే చేయబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకేతో కలిసి ఆమె మరోసారి పనిచేయబోతోందని వినికిడి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజీ పాత్ర బ్యాక్ గ్రౌండ్ సరిగా చూపించలేదు. ఆమె ఎన్నో దాటుకుని వచ్చినట్లు చెప్పారు కానీ ఆ పాత్ర బ్యాక్ గ్రౌండ్ ను పూర్తి స్థాయిలో చూపించలేదు.
ఇప్పుడు తీయబోయే వెబ్ సిరీస్/ వెబ్ ఫిలిం ది ఫ్యామిలీ మ్యాన్ కు ప్రీక్వెల్ గా ఉంటుందని తెలుస్తోంది. దీని గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.