
గత నాలుగైదు నెలలుగా సమంత జీవితంలో చాలా జరిగాయి. తన భర్త నుండి విడిపోతున్నట్లు సమంత ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. అలా ప్రకటించిందో లేదో సమంతకు ఎఫైర్లు ఉన్నాయని, అందువల్లే నాగ చైతన్య విడిపోయారని నిర్ణయించుకున్నాడని విమర్శలు చేసారు. ఆ రూమర్స్ పై సమంత స్పందించింది. తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని, తనను కించపరిచేలా మాట్లాడవద్దని అంది.
ఇక ఈ విషయాన్ని పక్కకు పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది సమంత. కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత సామ్ మళ్ళీ సినిమాలను సైన్ చేస్తోంది. ఇప్పటికే ఒక తెలుగు చిత్రాన్ని ఓకే చేసింది. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
అలాగే బాలీవుడ్ చిత్రాన్ని కూడా సమంత సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక టాప్ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ తో సమంతను అప్రోచ్ అవ్వగా ఆమె మరో ఆలోచన లేకుండా ఓకే చేసిందిట. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ నుండి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ముందుగా వద్దనుకుంది కానీ తన పర్సనల్ జీవితంలో జరిగిన వాటి నుండి విముక్తి పొందడానికి బాలీవుడ్ లో చిత్రాలను చేయాలని నిర్ణయించుకుంది. దసరా తర్వాత ఈ బాలీవుడ్ చిత్ర ప్రకటన ఉంటుందని సమాచారం.