Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ -చరణ్ ల సరసన ఆ ఇద్దరా !

ఎన్టీఆర్ -చరణ్ ల సరసన ఆ ఇద్దరా !

samantha, rashi khanna romance with ntr and charan యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ల కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించడానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే అధికారికంగా ఎప్పుడు , ఎక్కడ ప్రారంభం అవుతుంది అని చెప్పడం లేదు కానీ లోలోన మాత్రం అత్యంత వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు జక్కన్న అండ్ కో .

ఎన్టీఆర్ – చరణ్ ల కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు స్కై లెవల్లో ఉండటం ఖాయం అందుకే ఆ అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న . ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ లతో రొమాన్స్ చేసే అవకాశం రాశి ఖన్నా కు అలాగే సమంత ని వరించినట్లు తెలుస్తోంది . రాశి ఖన్నా ని ఇంతకుముందే ఓకే చేయగా తాజాగా సమంత ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది . పెళ్లి అయ్యాక సమంత మరింతగా జోరు పెంచి చిత్రాలను ఎంపిక చేసుకుంటోంది . అయితే ఇందులో సమంత ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుందా ? లేక చరణ్ తోనా ? అన్నది తేలాల్సి ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All