
న్యాచురల్ స్టార్ నాని నటించే నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగింది. తెలంగాణలోని కొత్తగూడెం ప్రాంతంలో జరిగే కథ ఇది. నాని ఇందులో పూర్తి స్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడతాడు. పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని సమాచారం.
కీర్తి సురేష్ ను ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా అనౌన్స్ చేసారు. అలాగే గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో సమంత కూడా నటిస్తుందని, సెకండ్ లీడ్ లాగా కాదు కానీ ఆమెది చిత్రంలో చాలా కీలకమైన పాత్ర అని వార్తలు వచ్చాయి. అయితే ఆ ‘దసరా’ చిత్రంలో సమంత రోల్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని సమంత అసలు సైన్ చేయలేదట. ఈ చిత్రంలో ఆమె నటించట్లేదని, క్యారెక్టర్ పాత్రలకు సామ్ ప్రస్తుతం నాట్ ఓకే అని తెలుస్తోంది.
ప్రస్తుతం సమంత రెండు తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రాలను సైన్ చేసింది. త్వరలోనే ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ మొదలవుతాయి. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసిన సామ్ బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.