
టాటూ..అనేది ప్రస్తుతం కామన్ అయిపొయింది. సినీ స్టార్స్ దగ్గరి నుండి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు టాటూ వేసుకుంటూ వస్తున్నారు. ఇక సమంత కూడా మూడు టాటూలు వేసుకుంది. ఆ మూడు టాటూలు కూడా తన మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవే. అందులో మొదటిది ఆమె నటించిన తొలిచిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన ఏం మాయ చేశావే.. గుర్తుగా వైఎంసీ పేరుతో వీపు మీద ఒక టాటూ వేయించుకుంది.
ఆ తర్వాత చైతో ఉన్న తన అనుబంధానికి గుర్తుగా నడుము పై భాగంలో చై అనే పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. అలాగే కుడి చేతి మీద వేయించుకున్న రెండు యారో మార్కులు.. ఇదే తరహా టాటూను నాగ చైతన్య కూడా వేయించుకోవటం తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన సమంత.. ఆ బంధానికి గుర్తుగా మాత్రం ఒంటి మీద టాటూల రూపంలో అలానే ఉండిపోయాయి. ఇటీవల మీరు వేయించుకోవాలనుకునే టాటూ ఏమిటన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆమె.. తనకు ఎలాంటి టాటూలు వేయించుకోవాలని లేదని తేల్చి చెప్పింది. మొత్తానికి టాటూ అంటే సామ్..వామ్మో అనే స్థితికి వచ్చేసింది.