విడాకుల తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. పెళ్లి కి ముందు ఎలాగైతే హాట్ హాట్ షూట్స్ తో మత్తెక్కించిందో..అంతకు మించి అనేలా ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. ఓ పక్క ఐటెం సాంగ్స్ , పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా ఉంటూనే , సోషల్ మీడియా లో వేడి సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఆమె ఒక అవార్డు ఫంక్షన్ కోసం అందాలు ఆరబోయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ పిక్స్ ఫై అభిమానులు , నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ వేస్తుండగా..తాజాగా వెంకటేష్ కూతురు కూడా ఈ పిక్స్ ఫై కామెంట్ చేసి మరింత వైరల్ చేసింది.
హీరో వెంకటేష్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత కూడా కామెంట్ చేసింది. ఫుడ్ లవర్ అయిన ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతా రన్ చేస్తుంది. ఆ ఖాతా నుంచి ‘ముచ్చటేస్తోంది..’ అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేసింది, ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ డైరెక్షన్లో ‘శాకుంతలం’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీంతో పాటు ‘యశోద’ లో నటిస్తుంది. తమిళ్‌లో నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన మరో హీరోయిన్ నయన తారతో సామ్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.