
సమంత..ఇప్పుడు మళ్లీ అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించడం..కేవలం లేడి ఓరియంటెడ్ కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో దర్శకులు కాస్త పట్టించుకోవడం మానేశారు. కానీ చైతు తో విడాకుల అనంతరం సమంత మళ్లీ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేడియా ఓరియంటెడ్ కథలతో పాటు ఐటెం సాంగ్ , వెబ్ సిరీస్ , గ్లామరస్ పాత్రలకు ఓకే చెపుతుంది. పుష్ప లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలే కాక సినిమా విశేషాలు , హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. దీంతో సోషల్ మీడియా లో ఆమెకు డిమాండ్ పెరిగింది.
దీంతో చాలా బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు సమంత ఇన్‌స్టాను వేదికగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సమంతకు వాణిజ్య ప్రకటన డిమాండ్ పెరిగిపోయింది. పెట్టే ప్రతి పోస్ట్‌కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు సామ్ ఆర్జిస్తున్నట్లు సమాచారం. కేవలం పోస్ట్‌లకు మాత్రమే ప్రత్యేకించి ఏమైనా ఫొటోషూట్స్, వీడియోలు చేయాల్సి వస్తే వాటికి అదనంగా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని వినికిడి. ఈమె రేటు చూసి చాలామంది వామ్మో అనుకుంటున్నారు.