Homeన్యూస్దసరా సరదా కోసం సమంత?

దసరా సరదా కోసం సమంత?

దసరా సరదా కోసం సమంత?
దసరా సరదా కోసం సమంత?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించనున్న ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. SLV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూరల్ లవ్ స్టోరీగా దసరా రూపొందనుంది. ఈ చిత్రం కోసం నాని పూర్తి స్థాయిలో తెలంగాణ  యాసలో మాట్లాడనున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇప్పటికే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాని లుక్ కూడా అదిరింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం దసరా చిత్రంలో హీరోయిన్ గా సమంత నటిస్తుందని తెలుస్తోంది. కెరీర్ కు కొంత కాలం బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మునుపటి స్థాయి కంటే వేగంగా చిత్రాలను చేయాలని డిసైడ్ అయింది.

- Advertisement -

ఇప్పటికే నిర్మాతలు సమంతను అప్రోచ్ అయ్యారట. అయితే సామ్ ఇంకా అగ్రిమెంట్ ను సైన్ చేయలేదు. త్వరలోనే సమంత ఈ చిత్రంపై తుది నిర్ణయం తీసుకోనుందిట. ఆమెకు అయితే కథ నచ్చిందని తెలుస్తోంది. నాని, సమంత కలిసి ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు వంటి చిత్రాలను చేసిన సంగతి తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All