Homeటాప్ స్టోరీస్అర్పితా కోసం గ్లామ‌ర్ త‌లుపులు తెరిచింది!

అర్పితా కోసం గ్లామ‌ర్ త‌లుపులు తెరిచింది!

అర్పితా కోసం గ్లామ‌ర్ త‌లుపులు తెరిచింది!
అర్పితా కోసం గ్లామ‌ర్ త‌లుపులు తెరిచింది!

పెళ్లి త‌రువాత న‌ట‌న‌కు మాత్ర‌మే అవ‌కాశం వున్న పాత్ర‌ల్ని, చిత్రాల్ని ఎంచుకుంటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది స‌మంత‌. `అల్లుడు శ్రీ‌ను`లో త‌ప్ప అందాల ఆర‌బోత‌కు ఇష్ట‌ప‌డ‌ని ఈ అక్కినేని వారి ముద్దుల కోడ‌లు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ ఆర్పితా మెహ‌తా కోసం మాత్రం గ్లామ‌ర్ తలుపులు తెరిచి షాకిస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీమ్యాన్ 2`లో టెర్రిరిస్టుగా క‌నిపించ‌నున్న స‌మంత తాజాగా అర్పితా మెహ‌తా కోసం అందాల విందుకు సై అనేసింది.

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్‌ల‌కు గ‌త కొంత కాలంగా ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వారి వార్డ్ రోబ్ డ్రెస్ క‌లెక్ష‌న్స్‌కి ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ వ‌స్తున్న ఆర్పితా మెహ‌తా ఈ రంగంలోకి ప్ర‌వేశించి ప‌దేళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో త‌న‌తో టాచ్‌లో వున్న గ్లామ‌ర్ హీరోయిన్‌ల‌తో `ది మిర్ర‌ర్‌` అనే బుక్ కోసం గ్లామ‌ర‌స్ ఫొటో షూట్‌ల‌ని నిర్వ‌హించింది. ఇప్ప‌టికే దీని కోసం బాలీవుడ్ హాట్ లేడీ మ‌లైకా అరోరా స్పెషల్ డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి  కుర్ర‌కారు గుండెల్ని పిండేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

తాజాగా స‌మంత కూడా ఇంచు మించి అదే త‌ర‌హాలో అందాల్ని ఆర‌బోసి ర‌చ్చ చేసింది. మునుపు ఎన్న‌డూ లేని విధంగా కోర చూనుల‌తో క‌వ్విస్తూ త‌న అందాల విందు చేసింది. స‌మంత రెచ్చిపోయి అందాల విందు చేసిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All