Homeటాప్ స్టోరీస్సమంత: హైదరాబాద్ పై క్లారిటీ ఇచ్చింది, చైతన్యపై ఏది?

సమంత: హైదరాబాద్ పై క్లారిటీ ఇచ్చింది, చైతన్యపై ఏది?

సమంత: హైదరాబాద్ పై క్లారిటీ ఇచ్చింది, చైతన్యపై ఏది?
సమంత: హైదరాబాద్ పై క్లారిటీ ఇచ్చింది, చైతన్యపై ఏది?

అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారా? గత నెల, నెలన్నర నుండి సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా కూడా ఇదే వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై నాగ చైతన్య కానీ సమంత కానీ, వారికి సన్నిహిత వర్గాలు కానీ ఎవరూ స్పందించలేదు. సమంతను డైరెక్ట్ గా అడిగినా కూడా లేదని ఖండించలేదు ఇది అందుకు తగిన సందర్భమా అని కోపగించుకుంది. దీంతో వార్తలు మరింత ఎక్కువగా వచ్చాయి. వీరిద్దరూ విడిపోబోతున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సక్సెస్ మీట్ కూ స్కిప్ కొట్టింది సమంత.

ఇదిలా ఉంటే సమంత హైదరాబాద్ విడిచి ముంబైకు తన మకాం మార్చేస్తోందని తాజాగా రూమర్స్ వచ్చాయి. దీనిపై మాత్రం క్లారిటీ ఇచ్చింది సమంత. నిన్న సమంత మొదలుపెట్టిన బ్రాండ్ సాకి లాంచ్ అయ్యి సంవత్సరం గడిచిన సందర్భంగా అభిమానులతో ముచ్చటించింది. అందులో ఒకరు మీరు ముంబై వెళ్లిపోతున్నారట కదా అని అడగ్గా, “నేను ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు.

- Advertisement -

ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా రూమర్స్ లాగానే ఇది కూడా అబద్ధం. హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది. నేను ఇక్కడే ఉంటాను. హైదరాబాద్ నా ఇల్లు, ఎప్పటికీ అది నా ఇల్లే” అని సమంత వ్యాఖ్యానించింది. ఇదే ఫ్లోలో చైతన్యతో రూమర్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All