Homeటాప్ స్టోరీస్తాప్సీ బ్యానర్ లో సమంత..!

తాప్సీ బ్యానర్ లో సమంత..!

Samantha Bollywood entry under Tapsee Production
 

ఆఫ్టర్ మ్యారేజ్ సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ వచ్చిన సమంత నాగ చైతన్యతో డైవర్స్ ఎనౌన్స్ మెంట్ తర్వాత ఇక పూర్తిగా తన ఫోకస్ సినిమాల మీద పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో వరుసగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో సమంత బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ నిర్మిస్తున్న సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. తాప్సీ తన నిర్మాణ సంస్థ అవుట్ సైడర్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో సమంత లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తుందట. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.

ఆల్రెడీ సమంత బాలీవుడ్ లో చేసిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ అమ్మడికి సూపర్ క్రేజ్ తీసుకువచ్చింది. అంతేకాదు అమేజాన్, నెట్ ఫ్లిక్స్ సమంతతో వెబ్ సీరీస్ కాంట్రాక్ట్ కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. పనిలో పనిగా సమంత బాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మొదట అక్కడ తాప్సీ బ్యానర్ లో సినిమా సైన్ చేసిందని తెలుస్తుంది.

- Advertisement -

ఇక తెలుగులో ఆల్రెడీ గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తున్న సమంత శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమాకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. అంతేకాదు మరో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మొత్తానికి మరోసారి సమంత సినిమాల మీద ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All