
విడాకులు అనంతరం సమంత పూర్తిగా సినిమాల ఫై ఫోకస్ పెట్టింది. తనవద్దకు వచ్చిన ప్రతి ఛాన్స్ కు ఓకే చెపుతుంది. అలాగే నాగ చైతన్య తో ఏ విధంగానూ ఎలాంటి విషయంలోనూ లింకు ఉండకూడదనే నిర్ణయం తీసుకుంది. అందుకే చైతు తాలూకా జ్ఞాపకాలను దూరం చేస్తుంది. ఈ మధ్యనే పెళ్లి రోజు చీరను , అక్కినేని ఫ్యామిలీ ఇచ్చిన ఆభరణాలను వెనక్కు పంపినట్లు వార్తలు రాగా..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
గతంలో సమంత , నాగచైతన్య ఇద్దరు కూడా ఓకే మేనేజర్ తో కొనసాగుతూ వచ్చారు. వారి ప్రతి విషయాన్ని కూడా అతనే దగ్గరుండి చూసుకునేవారు. ఇక సమంత, నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత ఆ మేనేజర్ ను పూర్తి గా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా అతనితో ఉన్న అగ్రిమెంట్ ను కూడా ఆమె క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబై కి షిఫ్ట్ కాబోతున్న నేపథ్యంలో కొత్త గా మేనేజర్ ను ఎంపిక చేసుకునే ప్లాన్ లో ఉందట.