Homeటాప్ స్టోరీస్విడిపోతున్నట్లు ప్రకటించిన చైతన్య, సమంత

విడిపోతున్నట్లు ప్రకటించిన చైతన్య, సమంత

విడిపోతున్నట్లు ప్రకటించిన చైతన్య, సమంత
విడిపోతున్నట్లు ప్రకటించిన చైతన్య, సమంత

అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారా? గత రెండు నెలల నుండి ఈ విషయంపై వచ్చినన్ని రూమర్స్ మరి దేని మీదా రాలేదు అనుకుంటా. చైతన్య, సమంతలు డివోర్స్ తీసుకుంటున్నారని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే ఇద్దరూ కూడా ఈ రూమర్స్ పై మౌనం వహించారు. విడిపోతున్నట్లు కానీ, రూమర్స్ ను ఖండించడం కానీ ఏమీ చేయలేదు. మొన్నామధ్య సమంతను బయట ఇదే విషయంపై ప్రశ్నిస్తే దానికి ఇదా సమయం అని కోప్పడింది కూడా.

ఇక కొద్దిసేపటి క్రితం ఇద్దరూ కూడా ఈ రూమర్స్ ను అధికారికం చేసారు. తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “మా శ్రేయోభిలాషులందరికీ, చాలా చర్చల అనంతరం చైతన్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. భార్యాభర్తలుగా మేము విడిపోతున్నాం. దశాబ్దానికి పైగా మా రిలేషన్ కు కోర్ అయిన స్నేహం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సమయంలో మా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, మీడియాకు మాకు ప్రైవసీ ఇవ్వాలని, మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థాంక్యూ” అని స్టేట్మెంట్ ను పోస్ట్ చేసింది సమంత.

- Advertisement -

నాగ చైతన్య కూడా అదే సమయానికి అదే స్టేట్మెంట్ ను పోస్ట్ చేసాడు. ఇన్నాళ్ల నుండి రూమర్ గా ఉన్న విషయంపై క్లారిటీ వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All