Homeటాప్ స్టోరీస్సాంగ్ ఆఫ్ ది ఇయర్ – సామజవరగమన

సాంగ్ ఆఫ్ ది ఇయర్ – సామజవరగమన

సాంగ్ ఆఫ్ ది ఇయర్ – సామజవరగమన
సాంగ్ ఆఫ్ ది ఇయర్ – సామజవరగమన

గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న దాదాపు 125 మిలియన్ల అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది . త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ & పూజా హెగ్డే హీరో, హీరోయిన్లు గా అభిమానుల ముందుకు వస్తున్న “అల.. వైకుంఠపురంలో” సినిమాకి సంబంధించి, అభిమానులు అందరూ కలిసి సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా సక్సెస్ చేసిన “సామజవరగమనా” పాట ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాలో అన్నిటికన్నా ఈ పాట తెచ్చిన హైప్ అంతా.. ఇంతా కాదు.

పారిస్ లోని ఐఫిల్ టవర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాట సిల్వర్ గా కూడా అద్భుతంగా ఉంది. ఈ పాటలో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే తో పాటు దాదాపు 30 మందికి పైగా డాన్సర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది, క్లాసికల్ మరియు వెస్ట్రన్ డాన్స్ మూమెంట్స్ కలిపి ఫ్యూజన్ థీం లో కంపోజ్ చేసిన స్టెప్పులు బాగున్నాయి. ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ చేస్తూ కూడా మన బన్నీ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ లు అయితే కేక. పూజా హెగ్డే అయితే చెప్పనక్కర్లేదు. “ఆమె కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి.. కళ్ళు భావాలు పలికిస్తూనే ఉన్నాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పూజ హేగ్దే కి అయితే “వెల్లువొచ్చి.. గోదారమ్మ” పాట తర్వాత అంత కంటే ఎక్కువ అప్లాజ్ రావడం ఖాయం.

- Advertisement -

అసలు మొదట ఈ పాటను స్క్రీన్ ప్లే తో పాటు, మాంటేజ్ లాగా తీద్దాం అని అనుకున్న టీం ఎప్పుడైతే,.. ఈ పాటకు అభిమానుల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ వచ్చిందో, ఈ పాటను విజువల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో సినిమాలో చూపించాలి..! అని ఫిక్స్ అయ్యారు. కొన్ని సినిమాలు గతంలో కూడా బాగా హిట్ అయిన ఒక్క పాటతో మొత్తం సినిమా కంటెంట్ ని పుల్ చేసాయి. ఇప్పుడు “సామజవరగమన” పాట కూడా ఆ లిస్టు లో చేరినట్టే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All