
పుష్ప చిత్రంలో సమంత ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో దుమ్ములేపిందో తెలియంది కాదు..ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా ఈ పాట హావ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా లోను ఈ పాట ఇంకా వినిపిస్తుండడం సమంత ను ఆశ్చర్యానికి గురి చేసింది.
రీసెంట్‌గా అమెరికాలో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఊ అంటావా.. ఊ అంటావా పాట వినిపించడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది చూసి సమంత సైతం నమ్మలేకపోయింది. తన పాటకు ఈ రెంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని ఊహించని సమంత ఆనందం పట్టలేక ఇందుకు సంబంధించిన వీడియోలను, ట్వీట్‌లను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ప్రస్తుతం సామ్..యశోద చిత్రం తో పాటు శాకుంతలం మూవీ చేస్తుంది.
#OoAntavaOoOoAntava at Ultra Miami.. Incredible reach to say the least.. Pan India ah bokka @alluarjun. Pan world.. #Pushpa.. At the biggest music festival in the world.. @PushpaMovie pic.twitter.com/sq6Bf6E9sn
— . (@urstrulyaaykayj) March 27, 2022