
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. సల్మాన్‌ఖాన్ నపటిస్తున్న తాజా చిత్రం `రాధే`. ది మోస్ట్ వాంటెడ్ భాయ్` అని ట్యాగ్ లైన్. ప్రభు దేవా తెరకెక్కిస్తున్న ఈ మూవీ మే 13న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. ఇందులో దిశ పటాని హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా సోమవారం ఈ మూవీకి సంబంధించిన `సీటీమార్..` గీతానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాటకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ మూవీతో బాలీవుడ్ బాటపడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `దువ్వాడ జగన్నాథం`. ఈ మూవీ కోసం అల్లు అర్జున్, పూజా హెగ్డేలపై చిత్రీకరించిన `సీటీమార్.. `సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్‌లో 200 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబట్టి రికార్డు సృష్టించిన ఈ పాటని `రాధే` చిత్రంలో రీ క్రయేట్ చేశారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బన్నీపై సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `సటీమార్..` సాంగ్‌రి మాకు అందించినందుకు థ్యాంక్స్ బన్నీ. `సీటీమార్ .. పాటలో నీ డ్యాన్స్, స్టైల్స్ నాకు ఎంతగానో నచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్. లవ్ యూ బ్రదర్` అని ట్వీట్ చేశారు. స్మలాన్ ట్వీట్‌కి బన్నీ వెంటనే స్పందించారు. `థ్యాంక్యూ సల్మాన్‌గారు మీ నుంచి ఇంతటి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇది స్వీట్ గెస్చర్. మీరు `రాధే` కోసం `సీటీమార్..`తో చేసిన మ్యాజిక్ కోసం అభిమానిలాగే ఎదురుచూస్తున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు` అని బన్నీ ట్వీట్ చేశారు.