
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం `రాధే`. `యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` అని క్యాప్షన్. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్‌ఖానే నిర్మిస్తున్నాడు. దిషా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. జాకీష్రాఫ్, రణ్‌దీప్ హుడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఈద్ పండగ నేపథ్యంలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది కానీ కరోనా కారణంగా మధ్యలో షూటింగ్ ఆగిపోవడంతో కుదరలేదు.
పది నుంచి పన్నెండు రోజుల షూటింగ్ బ్యాలెన్స్‌గా వుందట. దాన్ని వెంటనే పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇందు కోసం ఏకంగా ముంబైలోని మెహబూబియా స్టూడియోని సల్మాన్‌ఖాన్ బుక్ చేశారట. ఇందులోనే యాక్షన్ ఘట్టాలతో పాటు ఒక పాటను అజర్బైజాన్లో చిత్రీకరించాలనుకుంటున్నారట
కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణంపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్లాన్ మార్చిన చిత్ర బృందం యాక్షన్ ఘట్టాలతో పాటు ఒక పాటను మెహబూబా స్టూడియోలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజులవల్ ఎఫెక్ట్స్ పూర్తయ్యాక అక్టోబర్ లేదా నవంబర్‌లో థియేటర్స్ రీఓపెన్ అయితే దీపావళికి `రాధే`ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సల్మాన్‌ఖాన్ ప్లాన్ చేస్తున్నారట.