Homeటాప్ స్టోరీస్త‌న రికార్డుని తానే బ్రేక్ చేసుకున్న స‌ల్మాన్‌ఖాన్‌!

త‌న రికార్డుని తానే బ్రేక్ చేసుకున్న స‌ల్మాన్‌ఖాన్‌!

త‌న రికార్డుని తానే బ్రేక్ చేసుకున్న స‌ల్మాన్‌ఖాన్‌!
త‌న రికార్డుని తానే బ్రేక్ చేసుకున్న స‌ల్మాన్‌ఖాన్‌!

స‌ల్లూ భాయ్ స‌ల్మాన్‌ఖాన్ త్వ‌ర‌లో `రాధే మోస్ట్ వాంటెడ్ బాయ్`తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిశ ప‌టాని క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ని ఇటీవ‌లే మేక‌ర్స్ రిలీజ్ చేశారు. యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ రాధేగా స‌ల్మాన్‌ఖాన్ న‌టించాడు.

అయితే ఈ ట్రైల‌ర్‌లో స‌ల్మాన్‌ఖాన్ హీరోయిన్ దిశ ప‌టానిని లిప్ లాక్ చేసిన విజువ‌ల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. స‌ల్మాన్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి 32 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినిమాల్లో ఒక్క లిప్ లాక్ సీన్‌లో న‌టించ‌లేదు. అయితే ఈ విష‌యంలో త‌న పేరుమీద వున్న రికార్డుని `రాధే` సినిమాతో స‌ల్మాన్ బ్రేక్ చేయ‌డంతో ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

గ‌తంలో క‌పిల్ శ‌ర్మ ఆన్ స్క్రీర్ లిప్ లాక్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు స‌ల్మాన్ త‌న‌కు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇష్టం వుండ‌ద‌ని, పైగా ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డం ఇబ్బందిగా వుంటుంద‌ని సల్మాన్ ఖాన్ వెల్ల‌డించారు. అయితే తాజాగా `రాధే`లో దిశ ప‌టానికి లిప్ లాక్ ఇవ్వ‌డంతో అప్ప‌టి షో వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఆ నాటి స‌ల్మాన్ మాట‌ల్ని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యపోతున్నార‌ట‌. లేదు లేదంటూనే స‌ల్మాన్ దిశ‌తో లిప్‌లాక్ చేశాడ‌ని వాపోతున్నార‌ట‌.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All