Homeటాప్ స్టోరీస్బాడీ గార్డ్ చెంప పగులగొట్టిన సల్మాన్

బాడీ గార్డ్ చెంప పగులగొట్టిన సల్మాన్

సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ చెంప పగులగొట్టిన వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో . నిన్న సల్మాన్ నటించిన భారత్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన సల్మాన్ ఖాన్ ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు ముందుకు రావడంతో వాళ్ళ నుండి కాపాడేందుకు బాడీ గార్డ్స్ సల్మాన్ కు రక్షణ వలయంగా నిలబడ్డారు .

- Advertisement -

అయితే అదే సమయంలో సల్మాన్ ఖాన్ ఓ బాడీ గార్డ్ చెంప పగులగొట్టి వార్నింగ్ ఇస్తుండగా వీడియో తీశారు . ఇంకేముంది ఆ వీడియో ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది . సల్మాన్ తన బాడీ గార్డ్ ని కొట్టడానికి గల సరైన కారణం తెలియడం లేదు కానీ అక్కడ గుంపులో చూసిన వాళ్లలో మాత్రం చెంపదెబ్బ తిన్న బాడీ గార్డ్ ఓ పిల్లాడిపై దురుసుగా ప్రవర్తించడంతో సల్మాన్ అలా స్పందించాడని అంటున్నారు . ఇక భారత్ సినిమా విషయానికి వస్తే …… ఈ సినిమా టాక్ విభిన్నంగా ఉంది మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All